అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా నటించిన అప్ కమింగ్ రిలీజ్ మూవీ ‘12ఎ రైల్వే కాలనీ’. ఈ నెల నవంబర్ 21న మూవీ థియేటర్లో రిలీజ్ కానుంది. హార్రర్ బ్యాక్‌డ్రాప్లో వస్తున్న ఈ మూవీలో పొలిమేర ఫేమ్' కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటించింది.
నాని కాసరగడ్డ దర్శకత్వం వహించగా, పొలిమేర’, ‘పొలిమేర 2’ సినిమాలకి పనిచేసిన రైటర్ కం డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ కథను అందించారు. అంతేకాకుండా కథ, స్క్రీన్ ప్లే, మాటలు & షోరన్నర్గా అనిల్ వ్యవహరించారు.
ఈ మూవీ రిలీజ్కు ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ సింగిల్ అండ్ టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మంగళవారం (నవంబర్ 11న) ‘12ఎ రైల్వే కాలనీ’ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్ ఉత్కంఠ పెంచుతుంది. అల్లరి నరేష్తో పొలిమేర డైరెక్టర్ ఓ సరికొత్త ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ఇక అల్లరి ఆడియన్స్కు థియేటర్లో వణుకు గ్యారెంటీ అని చెప్పొచ్చు!
సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మించారు. ఇందులో డాక్టర్ కామాక్షి భాస్కర్లతో పాటుగా, సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
A love melody like no other, with #BheemsCeciroleo’s enchanting beats and @HeshamAWMusic’s soulful vocals ❤️🔥
— Junglee Music South (@JungleeMusicSTH) October 31, 2025
Here's the #12ARailwayColony First Single #KannodiliKalanodili Lyrical Video 😍
▶️ https://t.co/GqZ44rS3pF@allarinaresh #KamakshiBhaskarla @DrAnilViswanath… pic.twitter.com/MULsIQL6Ld
