ఢిల్లీ పేలుళ్ల కేసులో ఉగ్ర సంబంధాలున్న ఇద్దరు లేడీ డాక్టర్లు అరెస్ట్ !

ఢిల్లీ పేలుళ్ల కేసులో ఉగ్ర సంబంధాలున్న ఇద్దరు లేడీ డాక్టర్లు అరెస్ట్ !

ఢిల్లీ: ఉగ్రవాద నెట్వర్క్ సంబంధాలున్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరు మహిళా డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీ సుకున్నారు. ఫరీదాబాద్లో భారీ పేలుడు పదా ర్థాల స్వాధీనం తర్వాత అరెస్ట్ అయిన లక్నోకు చెందిన వైద్యురాలు డాక్టర్ షాహీన్ షాహిద్ జైషమొహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థ మహిళా విభాగానికి కీలక పాత్ర పోషించినట్లు ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. 

పాక్ లోని మసూద్ అజర్ సోదరి సాదియా అజర్ నేతృ త్వంలోని "జమాత్ ఉల్ మోమినాత్" విభాగం భారత్లో ఏర్పాటు చేయడంలో షాహీన్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. సాదియా భర్త యూసుఫ్ అజర్ కందహార్ హైజాకింగ్ కుట్రలో ప్రధాన నిందితుడు కాగా, మే 7న "ఆపరేషన్ సిందూర్"లో హతమయ్యా డు. ఇదిలా ఉండగా మరో మహిళా డాక్టర్ను అధికారులు అరెస్టు చేశారు. సహరన్పుర్కు చెందిన డాక్టర్ పర్వేజ్ అన్సారీ ఇంటిపై దాడులు చేసిన పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నా రు. ఫరీదాబాద్ ఉగ్రకుట్రలోని డాక్టర్ ఆదిల్తో ఈమెకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. 


లక్నోలోని లాల్బాగ్ ప్రాంతానికి చెందిన షాహీన్, ఫరీదాబాద్ జేఈఎం ఉగ్ర మాడ్యూల్ కేసులో అరెస్ట్ అయ్యారు.  ఆమెకారులో అసాల్ట్ రైఫిల్ను పోలీసులు స్వాధీనం చేసుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. షాహీన్, హర్యానా లోని అల్ఫలాహ్ విశ్వవిద్యాలయానికి చెందిన వైద్యురాలు ముజమ్మిల్ గనాయి అలియాస్ ముసయిల్తో సన్నిహిత సంబంధాలున్నట్టు వి చారణలో తేలింది. జమ్మూ-కాశ్మీర్లోని పుల్వా మాకు చెందిన ముజమ్మిల్, ఫరీదాబాద్లోని రెండు గదుల్లో 2,900కిలోల పేలుడు పదార్థం. ఆయుధాలు దాచిన కేసులో అరెస్ట్ అయ్యాడు. అతడిని ప్రశ్నించిన పోలీసులు షాహీన్ కారులో దాచిన మరిన్ని ఆయుధాలను స్వాధీనం చేసు కున్నారు. ఆమె పేరుతో ఉన్న హెచ్ఎర్$1 నంబరు గల మారుతి స్విఫ్ట్ కారు నుంచి పిస్టల్, కార్టిడ్జ్లు, టైమర్లు, పేలుడు పదార్థాలు మొత్తం 350 కిలోల వరకు బయటపడ్డాయి.

భారత్ లో యాక్టీవ్!!

భారత్ చేపట్టిన "ఆపరేషన్ సిందూర్" తో తీవ్ర దెబ్బతిన్న జైషామొహమ్మద్ తన కార్యకలాపాలను మళ్లీ విస్తరించేం దుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అక్టోబర్ 8న పాక్ లోని బహావల్పూర్లో "జమాత్ ఉల్ మోమినాత్” పేరుతో మహిళా విభాగాన్ని ప్రకటించింది. సాదియా అజర్ నేతృత్వంలో ఈ విభాగం మహిళలను ఉగ్రవాద మార్గం లోకి దింపేందుకు ప్రణాళికలు వేస్తున్న ట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. బహావల్పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లి, హరిపూర్, మన్సెహ్రా కేంద్రాల్లో చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన మహిళలను, జేఈఎం నేతల భార్యలను కూడా ఈ విభాగం ద్వారా చేర్చుకుంటు న్నట్లు సమాచారం.