హైదరాబాద్: ఇండియా గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ నార్వే లెజెండ్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను మరోసారి ఓడించాడు. సౌతాఫ్రికాలోని గ్రూట్‌బోస్ ప్రైవేట్ నేచర్ రిజర్వ్‌లో జరుగుతున్న ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ రౌండ్- రాబిన్ దశలో కార్ల్‌సన్‌కు చెక్ పెటి సంచలనం సృష్టించాడు.
మొత్తం ఏడు రౌండ్లు ముగిసేసరికి, అర్జున్ 4.5 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలిచి నాకౌట్ చేరుకున్నాడు. ఫిడే వరల్డ్ కప్ విన్నర్ జవోఖిర్ సిందరోవ్ (5.5 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా, లెవోన్ అరోనియన్ (5 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అర్జున్ తన నాకౌట్ మ్యాచ్‌లో జర్మనీ ఆటగాడు విన్సెంట్ కీమర్‌తో తలపడనున్నాడు.

