
న్యూఢిల్లీ: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్ ఫిడే వరల్డ్ కప్‌లో రెండోసీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఈ నెల 30 నుంచి నవంబర్ 27 వరకు గోవాలో ఈ టోర్నీ జరగనుంది. డిఫెండింగ్ చాంపియన్ డి. గుకేశ్, ఆర్. ప్రజ్ఞానందకు ఒకటి, మూడో సీడ్ కేటాయించారు. డెన్మార్క్ స్టార్ ప్లేయర్ అనిష్ గిరి నాలుగో సీడ్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా 206 మంది ఈ టోర్నీలో పోటీపడుతున్నారు.
రెండు మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 17 కోట్ల 75 లక్షలు)ని కేటాయించారు. ఈ టోర్నీలో టాప్–3లో నిలిచిన ప్లేయర్లు క్యాండిడేట్స్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తారు. వెస్లీ సో (అమెరికా), విన్సెంట్ కీమర్, వీ యి, నొడిర్బెక్ అబ్దుసత్తారోవ్, షఖ్రియార్ మయెద్యరోవ్, హాన్స్ నీమాన్ టైటిల్‌పై గురి పెట్టారు. ఈసారి విమెన్స్ వరల్డ్ కప్‌ను సపరేట్ చేసి జూలైలో నిర్వహించారు. ఇందులో దివ్య దేశ్‌ముఖ్ టైటిల్ సాధించడంతో పాటు 2026 ఉమెన్స్ క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించింది.