సీఎం కేసీఆర్ ఆదేశం : పరిష్కారమైన రైతు శరత్ భూమిపట్టా సమస్య

సీఎం కేసీఆర్ ఆదేశం : పరిష్కారమైన రైతు శరత్ భూమిపట్టా సమస్య

మంచిర్యాల: సీఎం కేసీఆర్ ఆదేశాలతో రైతు శరత్ భూమి సమస్య గంటల్లో పరిష్కారమైంది. రైతు శరత్ భూమి ఇతరులకు పట్టా చేశారన్న ఆరోపణలపై కలెక్టర్ భారతి హోళికేరి చర్యలు తీసుకున్నారు. RI పెద్దిరాజు, VRO కరుణాకర్‌ ను సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి తహశీల్దార్ రాజలింగుపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. రైతు శరత్ తండ్రి శంకరయ్య నష్టపోయినందుకు అత్యవసర నిధుల నుంచి రైతుబంధు ద్వారా రూ.31వేల 200 చెక్కును కలెక్టర్ భారతి అందజేశారు. తన భూమికి సంబంధించిన పట్టాను కూడా కలెక్టర్ భారతి శరత్ తండ్రి శంకరయ్యకు అందజేశారు. రైతు సమస్య పరిష్కారం కావడంతో సీఎం కేసీఆర్‌కు రైతు శరత్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు.