రోహిత్ కంబ్యాక్ లోడింగ్.. వన్డే సీరీస్ కోసం చెమటోడుస్తున్న హిట్ మ్యాన్

రోహిత్ కంబ్యాక్ లోడింగ్.. వన్డే సీరీస్ కోసం చెమటోడుస్తున్న హిట్ మ్యాన్

రోహిత్ శర్మ క్రికెట్ ఆడుతుంటే చూసి ఇప్పటికీ 75 రోజులు గడిచాయి. IPL-2025 లో ముంబై ఇండియన్స్ సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో హిట్ మ్యాన్ బ్యాటింగ్ చూశారు క్రికెట్ ఫ్యా్న్స్. ఐపీఎల్ టోర్నమెంట్ జరుగుతుండగానే టెస్టుకు రిటైర్మెంట్ ప్రకటించారు రోహిత్. అప్పటి నుంచి రోహిత్ ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారింది. 

హిట్ మ్యాన్ మళ్లీ బ్యాట్ పట్టుకుంటే చూడాలనుకునే క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్. రోహిత్ శర్మ మళ్లీ కంబ్యాక్ ఇచ్చేందుకు అంతా సిద్ధమైంది. అందుకోసం నెట్స్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు హిట్ మ్యాన్. లేట్ నైట్స్ లో తన కోచ్ అబిషేక్ నాయర్ తో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. 

రోహిత్ త్వరలోనే వైట్ బాల్ క్రికెట్ ఆడనున్నాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆస్ట్రేలియా వన్డే టూర్ లో రోహిత్ కూడా ఉంటాడని మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే ఈ ఊహాగానాలకు ఊతం ఇచ్చేలా రోహిత్ ప్రాక్టీస్ చేస్తుండటం ఇంట్రెస్టింగ్ థింగ్. 

కంబ్యాక్ ఇచ్చేందుకు రోహిత్ శర్మ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. అతని ఫ్రెండ్, కోచ్ అయిన అభిషేక్ నాయర్ తో కలిసి ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. నాయర్ తో ట్రైనింగ్ తీసుకుంటూ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. ముంబై స్టేడియంలో రోహిత్ ప్రాక్టీస్ చూసి.. కంబ్యాక్ విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నాడో అనే కామెంట్స్ వెల్తువెత్తున్నాయి. 

అంతకు ముందు నాయర్ తో కలిసి జిమ్ లో దిగిన ఫోటోను రోహిత్ షేర్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా వైట్ బాల్ టూర్ కోసం ప్రిపరేషన్స్ మొదలుపెట్టారని అనుకున్నారు ఫ్యాన్స్. ఆ తర్వాత నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండటంతో కంబ్యాక్ స్ట్రాంగ్ గా ఉంటుంది భావిస్తున్నారు. 

అక్టోబర్ లో ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లనుంది టీమ్ ఇండియా. మూడు వన్డేల సీరీస్ తర్వాత 5 టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ టూర్ లో రోహిత్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాడు.