
ఘోర ప్రమాదం.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కల్లూరు జరిగింది. 2025, ఆగస్ట్ 15వ తేదీ మధ్యాహ్నం జరిగిన ఈ యాక్సిడెంట్ కలకలం రేపింది.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల నుంచి కల్లూరు వెళుతున్నది ఓ కారు. సరిగ్గా కల్లూరు దగ్గరకు వచ్చే సమయానికి వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పింది. డ్రైవర్ బ్యాలెన్స్ చేయలేకపోయాడు. దీంతో రోడ్డు పక్కనే ఉన్న సాగర్ కాలువలోకి దూసుకెళ్లింది కారు.
అదృష్టం ఏంటంటే.. సాగర్ కాలువలోకి వెళ్లిన కారు నుంచి డ్రైవర్ సురక్షితంగా ఈదుకుంటూ బయటకు వచ్చాడు. ఆ వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చారు. లోకల్ గా ఉన్న కొంత మంది ఈతగాళ్లు, గ్రామస్తులు రంగంలోకి దిగారు.
కాలువలోని కారుకు తాళ్లు కట్టి ఒడ్డుకు ఈడ్చుకొచ్చారు. ప్రమాదం ఘోరంగా జరిగినా ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
కారులో డ్రైవర్ ఒక్కరే ఉండటంతో ప్రమాదం తప్పింది అంటున్నారు స్థానికులు.
►ALSO READ | తెలంగాణ డీజీపీ జితేందర్ ఇంట తీవ్ర విషాదం..