నటి కస్తూరి రాజకీయ అరంగేట్రం.. బీజేపీలో చేరికపై నైనార్ నాగేంద్రన్ హర్షం

నటి కస్తూరి రాజకీయ అరంగేట్రం..   బీజేపీలో చేరికపై  నైనార్ నాగేంద్రన్ హర్షం

ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలిగిన నటి కస్తూరి..  ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.  సినిమాలతో పాటు సామాజిక అంశాలపై తన అభిప్రాయలను నిర్మొహమాటంగా తెలియజేస్తూ.. తరచూ వార్తల్లో  నిలచే కస్తూరి బీజేపీలో చేరారు. చెన్నైలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కమలం కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు.  

ఈ సందర్భంగా  నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ నటి కస్తూరితో పాటు సామాజిక కార్యకర్త నమితా మారిముత్తు ఈ రోజు బీజేపీలో చేరడం శుభపరిణామని అని అన్నారు. వారి రాజకీయ ప్రయాణం తమిళనాడు బీజేపీలో ప్రారంభమైనందుకు సంతోషంగా ఉందని తెలిపారు.  వారి రాక తమిళనాట బీజేపీ బలోపేతానికి దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

►ALSO READ | Rajinikanth@50 : రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం.. బస్ కండక్టర్ నుండి సూపర్ స్టార్ వరకు ఎలా?

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించి ఆగ్ర నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించడంతో పాటు టీవీ షోల పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండే కస్తూరి, తన ధైర్యమైన అభిప్రాయాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆమె రాజకీయ ప్రవేశం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కస్తూరి రాజకీయ ప్రస్థానం ఎలా సాగుతుందో చూడాలి.