
ఢిల్లీ నిజాముద్దీన్ ఏరియా. ఇక్కడే మొఘల్ రాజుల సమాధులు ఉన్నాయి. మొఘల్ సామ్రాజ్యంలోని రెండో రాజు.. చక్రవర్తి అయిన హుమాయున్ సమాధి ఉంది. ఈ ప్రాంతంలో నిర్మాణాలు కూడా ఉన్నాయి. సమాధుల ప్రాంతంలోని ఓ విశ్రాంతి గదులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడే ప్రమాదం జరిగింది.
విశ్రాంతి గదుల పైకప్పు కూలి పోయింది. ఐదుగురు చనిపోయారు. 12 మంది గాయపడ్డారు. 2025, ఆగస్ట్ 15వ తేదీ మధ్యాహ్నం 4 గంటల 30 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
హుమాయున్ సమాధి సముదాయంలో ఓ మసీదు ఉంది. దాని పక్కనే ఉన్న రెస్ట్ రూమ్స్ పై కప్పు కూలి ఈ ప్రమాదం జరిగినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
హుమాయున్ సమాధి సముదాయం కూలిపోతుంది అంటూ ఓ ఫోన్ కాల్ వచ్చిందని.. ఆ వెంటనే పోలీసులు, ఫైర్, రెస్క్యూ సిబ్బంది స్పాట్ కు చేరుకున్నాం అని వెల్లడించారు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ ఆఫీసర్.
ప్రమాదం నుంచి 12 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని.. వాళ్లందరూ ప్రాణాలతో బయటపడ్డారని వివరించారు ఫైర్ సిబ్బంది. ఐదుగురు చనిపోయినట్లు స్పష్టం చేసిన అధికారులు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.
ఢిల్లీలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. పాత బిల్డింగ్స్, పెద్ద పెద్ద చెట్లు కూలిపోతున్నాయి. ఈ క్రమంలోనే హుమాయున్ సమాధి ఏరియాలోని రెస్ట్ రూమ్స్ కూలిపోయి ఉండొచ్చు అంటున్నారు NDRF అధికారులు.
హుమాయున్ సమాధిని యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు ఉంది. ఢిల్లీలో ప్రముఖ పర్యాటన ప్రాంతం కూడా ఇది. రోజూ వందలాది మంది దేశీయ, విదేశీ పర్యాటకులు హుమాయున్ టూబ్స్ సందర్శిస్తుంటారు. దీన్ని 16వ శతాబ్దంలో హుమాయున్ స్మారక చిహ్నంగా నిర్మించారు. హుమాయున్ సమాధి ఇక్కడే ఉంది. ఇప్పుడు ఈ సమాధి పక్కనే ఈ ప్రమాదం జరిగింది.