
నేడు భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, రాజకీయ నాయకులు వివిధ ప్రదేశాలలో జాతీయ జెండాను ఎగురవేసి అమరవీరులకు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దేశం కోసం ప్రాణాలను అర్పించిన సైనికులకు జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛంతో నివాళులర్పించారు.
ఆమెతో పాటు సైనిక నాయకులు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దేశ రాజధానిలో స్వాతంత్ర వేడుకల సమయంలో భారీ వర్షంలో గొడుగు కూడా లేకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలబడి అమరవీరులకు సెల్యూట్ చేస్తు నివాళులర్పించారు. తరువాత ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశ సేవలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన తొమ్మిది మంది భారత వైమానిక దళ అధికారులకు వీర్ చక్ర అవార్డులు లభించాయి.