V6 News

నిజామాబాద్ జిల్లాలో పేకాటలో పట్టుబడ్డ మున్సిపల్ చైర్మన్

నిజామాబాద్ జిల్లాలో పేకాటలో పట్టుబడ్డ మున్సిపల్ చైర్మన్

ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌‌‌‌లో పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి బైంసా మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాద్రి, ఆర్మూర్ 25వ వార్డు కౌన్సిలర్ మెడిదల వెంకట్ గౌడ్‌‌‌‌తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ.1,79,940, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్ ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌వో సత్యనారాయణ గౌడ్ తెలిపిన ప్రకారం.. సీసీఎస్ ఏసీపీ మస్తాన్ వలీ ఆధ్వర్యంలో సిబ్బంది ఆదివారం రాత్రి ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెర్కిట్ శివారులోని తిరుమల గార్డెన్స్‌‌‌‌పై దాడి చేశారు.

ఈ దాడిలో పేకాట ఆడుతున్న తుమొల్ల దత్తాద్రి, మెడిదల వెంకట్ గౌడ్‌‌‌‌తో పాటు తొర్లికొండకు చెందిన రత్నగిరి శంకర్ గౌడ్, నిర్మల్‌‌‌‌కు చెందిన సుంకరి మహేశ్, మాదారపు అభిలాష్, బైంసాకు చెందిన సయ్యద్ ఆసిఫ్‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నారు. పేకాట నిర్వహించిన తిరుమల గార్డెన్ ఫంక్షన్ హాల్ యజమాని శ్రీనివాస్ గౌడ్‌‌‌‌పై కూడా కేసు నమోదు చేశారు.