
ఆర్మూర్, వెలుగు: కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ని హైదరాబాద్ లో వారి ఇంటి వద్ద మంగళవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... మల్కాజి గిరి పార్లమెంట్ ఇంచార్జి గా అనుసరిస్తున్న విధి విధానాలను వివరించినట్లు తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ ఎన్నికల కోసం చేయాల్సిన వ్యుహాలను చర్చించినట్లు తెలిపారు.