సై అంటే సై : ఇండో- పసిఫిక్లో ఆయుధ పోటీ

సై అంటే సై : ఇండో- పసిఫిక్లో ఆయుధ పోటీ

అభివృద్ధి చెందుతున్న దేశాలకు అగ్రదేశాలు ఆయుధాలను విపరీతంగా అమ్ముతుండటంతో ఇండో- పసిఫిక్, మిడిల్ఈస్ట్ నార్త్ ఆఫ్రికాలో భద్రత ప్రమాదంలో పడింది. పోటాపోటీగా వెపన్స్ను దిగుమతి చేసుకుంటుండటంతో ఈ దేశాల మధ్య వైరం పెరుగుతోంది. ఆయుధాలు అమ్ముతున్న దేశంగా అమెరికా తొలి స్థానంలో ఉందని, తర్వాత ప్లేస్లో రష్యా ఉందని స్టాక్హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. ఇది ప్రపంచ భద్రతకు సవాలుగా మారుతోందని చెప్పింది.

అమెరికా.. లార్జెస్ట్ ఎక్స్పోర్టర్

అమెరికా 2014-–18లో 98 దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసింది. మిడిల్ఈస్ట్ దేశాలకు 50 శాతం వెపన్స్ ఇక్కడి నుంచే డంప్ అయ్యాయి. సౌదీ అరేబియా అత్యధికంగా 22 శాతం ఆయుధాలు దిగుమతి చేసుకుంది. ఆస్ట్రేలియా 7.7 శాతం, యూఏఈ 6.7 శాతం దిగుమతి చేసుకున్నాయి. 2009-–13 నాటితో పోలిస్తే అమెరికా ఆయుధ ఎగుమతులు 12 శాతం పెరిగాయి.

రష్యా నుంచి తగ్గిన ఎగుమతులు

2014-–18లో రష్యా 48 దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసింది. రష్యా నుంచి ఇండియా అత్యధికంగా 27 శాతం, చైనా 14 శాతం, అల్జీరియా 14 శాతం దిగుమతి చేసుకున్నాయి. 2012–13 తో పోలిస్తే రష్యా ఎగుమతులు 17 శాతం తగ్గాయి. అ మెరికా
ఆంక్షల వల్ల ఇండియా దిగుమతులు భారీగా తగ్గడంతో రష్యా ఎగుమతులు క్షీణించాయి.

53 దేశాలకు చైనా వెపన్స్

2014-–18లో చైనా 53 దేశాలకు ఆయుధాలను అందించింది. ఆ దేశ ఆయుధ ఎగుమతులు 2004–-08లో 195 శాతం పెరిగి స్థిరంగా కొనసాగుతున్నాయి. కానీ లాంగ్రేంజ్ మిసైల్స్, మిసైల్డిఫెన్స్ సిస్టమ్స్ తయారీ, ఎక్స్పోర్ట్లలో చైనా ఇంకా వెనకే ఉంది. చైనా ఆయుధాల్లో పాక్ అత్యధికంగా 37 శాతం, బంగ్లాదేశ్16 శాతం, అల్జీరియా 11 శాతం కొంటున్నాయి.

మిడిల్ ఈస్ట్లో నువ్వా.. నేనా?

సిరియా, ఇరాక్, యెమెన్లలో సంక్షోభం, సౌదీ, ఇరాన్ల పరోక్ష యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో మిడిల్ ఈస్ట్కు దిగుమతి అవుతున్న ఆయుధాల్లో ఈ దేశాలన్నీ 87 శాతం వెపన్స్ కొంటున్నాయి. ఇంతకుముందు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఇండియా ఉండగా, ఇప్పుడు ఆ స్థానాన్ని సౌదీ అరేబియా ఆక్రమించింది.