
జమ్మూ కాశ్మీర్ లోని మచిల్ సెక్టార్ లో ఆదివారం నాడు ఉగ్రవాదులు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు భద్రతా దళాల సిబ్బంది మృతి చెందారు. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ జవాన్ వీర మరణం పొందాడు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమాన్ పల్లి గ్రామానికి ర్యాడ మహేష్(25) గత 6 సంవత్సరాలుగా ఆర్మీలో పని చేస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మహేశ్ కూడా మరణించాడు. మహేశ్ సంవత్సరం క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతని మృతితో కోమాన్‌పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మహేశ్ మరణించాడని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.