రైలును తోయ‌టం ఏంటీ.. నిజంగా తోసుకుంటూ వెళ్లారు.. ప్ర‌పంచంలోనే ఇదో అద్భుతం

రైలును తోయ‌టం ఏంటీ.. నిజంగా తోసుకుంటూ వెళ్లారు.. ప్ర‌పంచంలోనే ఇదో అద్భుతం

మధ్యలో ఆగిపోయిన బండిని తోసుకుంటూ వెళ్లటం కామన్.. ఆగిపోయిన కారును నెట్టుకుంటూ వెళ్లటం కామన్.. బస్సు అయినా.. లారీ అయినా నలుగురు కలిసి నెట్టుకుంటూ.. తోసుకుంటూ వెళ్లటం చూసి ఉంటాం.. ప్రపంచంలోనే ఇదో అద్భుతం.. ఆగిపోయిన రైలును అందరూ కలిసి నెట్టుకుంటూ వెళ్లారు. వింతగా అనిపించినా.. ఇది ఇండియాలో జరగటం మరో విశేషం.. ఆర్మీ జవాన్లు, పోలీసులు, రైలులోని ప్రయాణికులు అందరూ కలిసి.. రైలును తోసుకుంటూ వెళ్లారు.. ఇండియాలో జరిగిన ఈ అద్భుతం ఏంటో పూర్తిగా తెలుసుకుందామా...

 

మధ్యలో ఆగిపోయిన రైలును నెట్టేందుకు పలువురు అధికారులు, ప్రయాణికులు చేతులు కలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్మీ జవాన్లు, పోలీసు బృందం, రైల్వే సిబ్బంది, స్థానికులు, ప్రయాణికులు.. ఇలా అందరూ కలిసి లోకో పైలట్‌కు సహాయపడటానికి ట్రాక్‌లపైకి వచ్చారు. ఈ సంఘటన దక్షిణ మధ్య రైల్వే మార్గంలో జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

ఎప్పుడు జరిగింది.. ఏయే రైల్వే స్టేషన్ల మధ్య ఈ సంఘటన జరిగింది అనే విషయంలో స్పష్టత రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో వైరల్ అవుతుంది. 
అంతే కాకుండా.. రైలులో ఆర్మీ జవాన్లు చాలా మంది ఉండటం చూస్తుంటే.. సైన్యం ఒక చోట నుంచి మరో చోటకు ఈ రైలులో ప్రయాణం చేస్తున్నట్లు విజువల్స్ చూస్తే అర్థం అవుతుంది. 
అదే విధంగా రైలులో జవాన్లతోపాటు మరికొంత మంది ప్రయాణికులు కూడా ఉన్నట్లు వీడియోలో స్పష్టం అవుతుంది. 


రైలును తోయటం అనే వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అమృతకాలం నడుస్తుంది అని కొందరు అంటేంటే.. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి చిత్రాలు కూడా చూస్తామని అనుకోలేదంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఏది ఏమైనా ఈ వీడియో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో జరిగిందంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా.. రైల్వే అధికారులు మాత్రం ఇంకా వివరణ ఇవ్వలేదు.