సికింద్రాబాద్ తిరుమల గిరి పరిధిలో ఘోరం జరిగింది. ఆర్మీ పబ్లిక్ స్కూల్ దగ్గర ఆర్మీ వాహనం బీభత్సం సృష్టించింది. కుమారుడిని స్కూల్ కు తీసుకెళ్తుండగా ద్విచక్ర వాహనాన్ని ఆర్మీ వాహనం ఢీ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పదేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా.. అతడి తల్లికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ ప్రమాదంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సింగిల్ వే కావడంతో ఇరు వైపుల కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకుని విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.గాయాలైన మృతుడి తల్లిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ALSO READ : భరణం ఇవ్వడం ఇష్టంలేక..రూ.6 కోట్ల ఉద్యోగానికి భర్త రిజైన్
ఉదయం బేగంపేట ఫ్లై ఓవర్ పై కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్ తో డివైడర్ ను ఢీ కొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ తో పాటు సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
