మరోసారి ‘టెర్మినేటర్’ గా ఆర్నాల్డ్

మరోసారి ‘టెర్మినేటర్’ గా ఆర్నాల్డ్

మరోసారి టెర్మినేటర్‌గా కనిపించబోతున్నాడు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జ్ నెగర్.  టెర్మినేటర్‌ సిరీస్‌లో ఆరో చిత్రంగా ‘టెర్మినేటర్‌: డార్క్‌ ఫేట్‌’ తెరకెక్కుతోంది. అందులో ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు 71 ఏళ్ల ఆర్నాల్డ్‌  తెలిపాడు. ‘డెడ్‌పూల్‌’ దర్శకుడు టిమ్‌ మిల్లర్‌ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ దర్శక నిర్మాత జేమ్స్‌ కేమరూన్‌ నిర్మిస్తున్నాడు. 1991లో వచ్చిన ‘టెర్మినేటర్‌ 2: జడ్జిమెంట్‌ డే’కు డైరెక్ట్‌ సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. అక్టోబర్ లో ఈ  సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.