మహిళలను అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ చేయాలని..తద్వారా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని దెబ్బతీయాలని మోదీ-షా ద్వయం చేసిన దుష్ట ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ అయింది. ఇండియా కూటమి ఐక్యతతో ఈ కుతంత్రాన్ని తిప్పికొట్టింది.
ప్రధానికి మహిళా అభివృద్ధిపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. నియోజకవర్గాల పెంపుతో సంబంధం లేకుండా 2023 చట్టం ప్రకారం 2029 ఎన్నికల నుంచే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. అప్పుడే ఆయన నిబద్ధత బయటపడుతుంది.

