
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి నుంచి చేపట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు ఆరోగ్య శ్రీ నెట్వర్క్హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ రమేశ్, డాక్టర్ హరిప్రసాద్ కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.