జై శ్రీరామ్.. ఆరు రోజుల్లో 19 లక్షల మంది దర్శనం

జై శ్రీరామ్..  ఆరు రోజుల్లో 19 లక్షల మంది దర్శనం

అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడ్ని దర్శించుకునేందుకు దేశ నలుమూల నుండి భక్తులు తరలివస్తున్నారు.   జై శ్రీరామ్ నినాదం అయోధ్య నగరం మార్మోగిపోతోంది. బాల రామడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన  జనవరి 22వ తేదీ నుండి జనవరి 8  వరకు ఈ ఆరు రోజుల్లో  దాదాపు 19 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.  రామ మందిరాన్ని 18.75 లక్షల మంది యాత్రికులు సందర్శించినట్టు ఈ మేరకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. 

మొదటి రోజు బాలరాముడ్ని 5 లక్షల మంది భక్తులు దర్శించుకోగా..   ఆ తరువాత రోజువారీగా సగటున 2 లక్షలకు పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించారు.  జనవరి 24న 2.5 లక్షలు, జనవరి 25న 2 లక్షల మంది దర్శించుకున్నారు. రిపబ్లిక్ డే జనవరి 26న 3.5 లక్షలు, జనవరి 27న 2.5 లక్షల మంది, జనవరి 28న 3.25 లక్షల మంది భక్తులు రామ్ లల్లా దర్శనానికి వచ్చినట్టు అధికారులు తెలిపారు. 

భక్తుల రద్దీ దృష్ట్యా, ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో ఆలయంలో ఏర్పాట్లను నిశితంగా నిర్వహించడానికి ఒక విశిష్ట కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తుంటుంది.