దుబాయ్‌‌లో నంది అవార్డ్స్

దుబాయ్‌‌లో నంది అవార్డ్స్

తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌‌ ఆఫ్‌‌ కామర్స్‌‌  ఆధ్వర్యంలో  ‘టీఎఫ్‌‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’  వేడుక‌‌లు దుబాయ్‌‌లో  నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతాని రామ‌‌కృష్ణ గౌడ్‌‌.  ఈ సందర్భంగా  సోమవారం అవార్డ్స్ బ్రోచర్‌‌‌‌ను రైటర్ విజయేంద్ర ప్రసాద్ లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘గ‌‌త కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డ్స్‌‌ని మ‌‌ళ్లీ ప్రతాని రామ‌‌కృష్ణ  ప్రభుత్వ స‌‌హ‌‌కారంతో ఇవ్వడం సంతోష‌‌ం. అయితే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తీసే చిత్రాల‌‌కు  స్పెష‌‌ల్‌‌గా నంది అవార్డ్ కేటాయిస్తే  బావుంటుందనేది నా ఆలోచ‌‌న‌‌. అలాగే తెలంగాణలో అద్భుత‌‌మైన  టూరింగ్ స్పాట్స్ ఉన్నాయి.

వాటిని బేస్ చేసుకుని 90 శాతం అక్కడే షూటింగ్ చేసే సినిమాల‌‌కు  నంది అవార్డ్స్‌‌తో పాటు న‌‌గ‌‌దు ప్రోత్సాహ‌‌కాలిస్తే మ‌‌రిన్ని చిత్రాలు రూపొందడంతో పాటు తెలంగాణ‌‌లో  టూరిజం పెరిగే అవ‌‌కాశం ఉంటుంది’ అన్నారు. అవార్డ్స్ కోసం 2021, 22 సంవ‌‌త్సరంలో విడుద‌‌లైన చిత్రాలు అప్లయ్ చేసుకోవ‌‌చ్చని,  దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా  నంది అవార్డులు ఇవ్వనున్నామన్నారు ప్రతాని. ఫిలిం చాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ పాల్గొన్నారు.