ఎన్నికల సిబ్బంది ఓటు వేసేలా ఏర్పాట్లు పూర్తి

ఎన్నికల సిబ్బంది ఓటు వేసేలా ఏర్పాట్లు పూర్తి
  • చేవెళ్ల లోక్ సభ సెగ్మెంట్ రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక

ఎల్ బీ నగర్,వెలుగు : లోక్ సభ ఎన్నికల నిర్వహణలో పాల్గొనే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు చేవెళ్ల లోక్ సభ సెగ్మెంట్ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ శశాంక గురువారం తెలిపారు.  సెగ్మెంట్ పరిధిలో ఎన్నికల అధికారులు, పోలింగ్, పోలీస్  సిబ్బందికి ఫామ్-–12 ద్వారా  మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్ లో సరూర్ నగర్ తహశీల్దార్ ఆఫీసు,  రాజేందర్ నగర్ కు అత్తాపూర్ లోని ఆర్డీఓ ఆఫీసు, శేరిలింగంపల్లికి జోనల్ కమిషనర్ ఆఫీసు

చేవెళ్లకు ఎంపీడీఓ ఆఫీసు, పరిగికి  నెం.1 బాలుర ఉన్నత పాఠశాల, వికారాబాద్ కు సంబంధించి బాలుర జడ్పీ హైస్కూల్ , తాండూర్ కు సాయిపూర్ లోని నం. 1 ప్రభుత్వ స్కూల్  కేంద్రాల్లో ఏఆర్ఓలు ఏర్పాటు చేసిన వోటర్ ఫెసిలిటీ సెంటర్స్ లో శుక్రవారం నుంచి 8 వ తేదీ వరకు ఓటు వేసే సౌకర్యం కల్పించినట్టు వివరించారు. చేవెళ్ల లోక్ సభ సెగ్మెంట్ లో 23వేల మంది ఓటు హక్కును వినియోగించుకొనున్నారని పేర్కొన్నారు.

142 మంది పోలింగ్ రోజు ఎమర్జెన్సీ విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ఫామ్–-12 డి ద్వారా 5వ తేదీ వరకు 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో  ఓటు హక్కు వినియోగించుకోనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు.