ప్రారంభానికి సిద్ధమైన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్

ప్రారంభానికి సిద్ధమైన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆగస్టు 04వ తేదీ గురువారం ఉదయం సీఎం కేసీఆర్ దీనిని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా... కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను సీపీ సివి ఆనంద్ పరిశీలించారు. వందల మంది కార్మికులతో ఎంట్రెన్స్ దగ్గర ఉన్న రోడ్డు మీద చెట్లు తొలగించి కాంపౌండ్ వాల్ చుట్టూ వెదురు చెట్లు నాటుతున్నారు. మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర డివైడర్లు, గేట్ దగ్గర పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. అన్ని పనులు సాయంత్రం కల్లా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు.

విశేషాలు...
అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో సీసీసీ నిర్మాణం చేపట్టారు. కమాండ్ కంట్రోల్ లో మొత్తం ఐదు టవర్లున్నాయి. టవర్ A లో  ఇరవై అంతస్తులు ఉండగా.. ఇందులోనే సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఏర్పాటు చేశారు. టవర్ A పై భాగంలో హెలిప్యాడ్ నిర్మాణం ఉంది. టవర్ B లో 15 అంతస్తుల్లో టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ ఉండనుంది. ఇక టవర్ C విషయానికి వస్తే.. ఇందులో మూడు ఫ్లోర్లున్నాయి. దీని ఆడిటోరియం గా పోలీసులు వినియోగించనున్నారు. టవర్ Dని మీడియా అండ్ ట్రైనింగ్ సెంటర్ గా ఉపయోగించనున్నారు. మొత్తం ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణంలో టవర్ A and E కీలకం. టవర్ E లో  కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్, సీసీ టీవీ మానిటరింగ్ మరియు వార్ రూమ్ ఉండనున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి హైదరాబాద్ నగరాన్ని 360 డిగ్రీల కోణంలో చూసే సౌకర్యం ఉంది. కమండ్ కంట్రోల్ లో ప్రత్యేక మ్యూజియం.. పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఫంక్షన్ అవుతుందో తెలుసుకునే అవకాశం ఉంది.