బ్రిక్స్-2026 సమావేశాలను 2026 సెప్టెంబర్ 12న అదికారికంగా ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా కీలక ప్రారంభ ప్రసంగం చేశారు. ప్రజలే కేంద్రంగా, మానవత్వమే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు. తమ విధానం ఏ దేశానికీ వ్యతిరేకం కాదని.. అందరినీ కలుపుకుని పోవడమే తమ ఎజెండా అని ప్రధాని మోదీ తెలిపారు. దీనికి బ్రిక్స్ దేశాలు సహకారంతో ముందుకు సాగాలని కోరారు.
BRICS 20వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా.. బ్రిక్స్ ఎన్నో గుర్తుండిపోయే నిర్ణయాలను తీసుకుందని చెప్పారు. అందరి సహకారంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. తమ విధానం ఏ దేశానికీ వ్యతిరేకం కాదని.. అందరినీ కలుపుకుని పోవడమే తమ ఎజెండా అని ప్రధాని మోదీ తెలిపారు.
గ్లోబల్ సౌత్ నియమాలను రూపొందించేదిగా ఉండాలని కోరారు మోదీ. ప్రస్తుతం ప్రపంచ పాలన ఒక పిరమిడ్ లా ఉందని.. పైన ఉన్న దేశాలు అధికారం, నిర్ణయాలు తీసుకుంటే.. కింద ఉన్న దేశాలు ప్రభావితం అవుతున్నాయి. ఈ దేశాలకు నిర్ణయాలు మార్చడంలో చాలా చిన్న పాత్ర ఉందన్నారు. గ్లోబల్ సౌత్ ప్రపంచ సంక్షోభాలలో ముందు వరుసలో ఉందని.. అదే సమయంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో వెనుకంజలో ఉందన్నారు.
బ్రిక్స్ కొనసాగింపు, అమలు చేసే యంత్రాంగాన్ని ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. అన్ని కార్యక్రమాలను, ఫలితాలను ట్రోయికా ద్వారా పర్యవేక్షించవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేశారు. మనం ఒక సురక్షితమైన డిజిటల్ రిపోజిటరీని సృష్టించవచ్చు, అక్కడ ప్రతి నిర్ణయంతో పాటు, నోడల్ పాయింట్, కాలపరిమితి, అమలు స్థితిని నమోదు చేయవచ్చునని అన్నారు. బ్రిక్స్‌ను బలోపేతం చేస్తూనే, మనం ప్రపంచ సంస్కరణలకు కూడా మార్గం సుగమం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రాబోయే 20 సంవత్సరాలకు, ఒక కొత్త, ప్రతిష్టాత్మకమైన అజెండాపై పనిచేయాల్సిన అవసరం ఉంన్నారు. బ్రిక్స్ అధ్యక్ష పదవి ప్రతి సంవత్సరం మారినప్పటికీ.. బ్రిక్స్ సంస్థాగత వేగం తగ్గకూడదని అన్నారు.
గ్లోబల్ సౌత్ నిర్ణయాలు రూపొందించేదిగా ఉండాలని.. భారత్ దానికి నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు.
బ్రిక్స్ దేశాల నావికుల భద్రత అంశాన్ని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. నావికుల భద్రతకు బ్రిక్స్ దేశాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
#WATCH | Delhi: During the BRICS Summit 2026, Prime Minister Narendra Modi says, "We need to work on a new and ambitious agenda for the next 20 years. We must begin this process with our own internal working systems. While the BRICS presidency rotates annually, this should not… pic.twitter.com/D9kXsqzmy8
— ANI (@ANI) September 12, 2026
