పాపం.. మేకలను అరెస్ట్ చేసిన హుజురాబాద్ పోలీసులు

పాపం.. మేకలను అరెస్ట్ చేసిన హుజురాబాద్ పోలీసులు

హుజురాబాద్ : హరితహారం మొక్కలు మేకలపాలిట శాపంలా తయారయ్యాయి అనడానికి ఈ సంఘటనే నిదర్శనం. హరితహారం మొక్కలు తిన్న రెండు మేకలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో బుధవారం జరగగా స్థానికంగా చర్చనీయాంశమైంది. హరితహారంలో భాగంగా హుజురాబాద్ లో సేవ్ ద ట్రీ అనే స్వచ్ఛంద సంస్థ 980 మొక్కలను నాటారు. అందులో కొన్ని మొక్కలను మేకలు తినేశాయి. బుధవారం ఓ స్కూల్ ఆవరణలో మొక్కలను తింటున్న రెండు మేకాలను స్వచ్చంద సంస్థ సభ్యులు పోలీసులకు అప్పగించారు.

మేకల యజమానులు గగ్గోలు పెట్టడంతో… రూ.పదివేల జరిమానా విధించి వాటిని విడుదల చేశారు. మేకలను అదుపు చేయాలని చాలా సార్లు చెప్పినా.. యజమానులు పట్టించుకోలేదని స్వచ్ఛంద సంస్థ సభ్యులు తెలిపారు. మేకల కారణంగానే మొక్కలు చనిపోయాయని అందుకే ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. మొక్కలు మేస్తున్నాయని మేకల యజమానులకు పలుసార్లు ఫిర్యాదు చేసినా.. వారు పట్టించుకోకపోవడంతో పోలీసులకు అప్పగించామని తెలిపారు. అయితే మూగజీవాలపై ఇలాంటి చర్యలు తీసుకోవడం ఎంటని ప్రశ్నిస్తున్నారు మేకలు యజమానులు. మొక్కలను నాటగానే సరిపోదు వాటి రక్షణ కోసం చుట్టూ కంచె పెట్టాలని మండిపడుతున్నారు.