యువతిని వేధిస్తున్న యువకుడి అరెస్ట్

V6 Velugu Posted on Sep 17, 2021

యువతిని వేధిస్తున్న యువకుడి అరెస్ట్
మేడిపల్లి, వెలుగు: పర్సనల్ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బోడుప్పల్ కు చెందిన ఓ యువతికి కొంతకాలం క్రితం ఘట్ కేసర్ మండలంలోని కొర్రెముల గ్రామానికి చెందిన సూర్యకాంత్ వాగ్మరేతో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. కొంతకాలం ఇద్దరూ ఫేస్ బుక్​లో చాటింగ్​ ​చేసుకున్నారు. ఈ క్రమంలో సూర్యకాంత్ యువతికి చెందిన పర్సనల్ ఫొటోలను కలెక్ట్ చేశాడు.  వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తూ ఆమె దగ్గరి నుంచి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాడు. యువతి ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత కూడా సూర్యకాంత్ ఆమెకు కాల్ చేసేవాడు.  బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు అడిగేవాడు. ఇలా రూ.4 లక్షలకు పైగా వసూలు చేశాడు.  ఇటీవల ఆస్ట్రేలియా నుంచి సిటీకి వచ్చిన ఆ యువతి అతడి వేధింపులు తట్టుకోలేక మేడిపల్లి పోలీసులకు కంప్లయింట్ చేసింది.   కేసు ఫైల్ చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సూర్యకాంత్ రాజస్థాన్​లో ఉన్నట్లు తెలుసుకుని బుధవారం అక్కడ అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని సిటీకి తీసుకొచ్చి  గురువారం రిమాండ్​కి తరలించారు.

Tagged Hyderabad, Young Man, arrest, Young woman, harassment,

Latest Videos

Subscribe Now

More News