పేకాట ఆడుతున్న డిప్యూటీ మేయర్, బీఆర్ఎస్ నేతల అరెస్ట్

పేకాట ఆడుతున్న డిప్యూటీ మేయర్, బీఆర్ఎస్ నేతల అరెస్ట్

మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడలు చేశారు. కో ఆప్షన్ మెంబర్ జగదీశ్వర్ రెడ్డి ఆఫీసులో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న పిర్జాదీగూడ డిప్యూటీ మేయర్ శివ కుమార్ గౌడ్ తోపాటు బీఆర్ఎస్ నాయకులు, బిల్డర్స్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవలె పిర్జాదీగూడ మేయర్ పై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. అయితే అరెస్టైన వారిలో డిప్యూటీ మేయర్ సహా కార్పొరేటర్ల భర్తలు ఉండడం గమనార్హం.