
హైదరాబాద్: నగరంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. వారి దగ్గరి నుంచి ఏడు సెల్‌ఫోన్లు, 2 బైకులు సీజ్ చేశారు. నిందితులపై గతంలో పేట్ బషీరాబాద్ పీఎస్‌లో 5 కేసులతో పాటు గౌరారం పీఎస్‌లో ఒక కేసు నమోదైంది. నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు.