కొకైన్ అమ్ముతున్న విదేశీయుడి అరెస్ట్

కొకైన్ అమ్ముతున్న విదేశీయుడి అరెస్ట్

హైదరాబాద్: నగరంలో గుట్టు చప్పుడు కాకుండా  కొకైన్ ను విక్రయిస్తున్న విదేశీయుడిని నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. రిపబ్లిక్ ఆఫ్ ఘానా దేశానికి చెందిన జోసెఫ్ టాగోయ్ (28) గత కొంత కాలంగా నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజమెల్ల ప్రాంతంలో నివసిస్తున్నాడు. గత కొంత కాలంగా నగరంలో పలువురు కస్టమర్లకు రహస్యంగా కొకైన్ సరఫరా చేసున్నాడు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు రాజమెల్లలోని అతని ఇంటిలో సోదా చేయగా 30 గ్రాముల కొకైన్ దొరికింది. జోసెఫ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతనివద్ద నుండి 30,500 నగదు సీజ్ చేసి రిమాండుకు తరలించారు.