డ్రగ్స్‌ కేసులో కీలక నిందితుడు అరెస్ట్‌

డ్రగ్స్‌ కేసులో కీలక నిందితుడు అరెస్ట్‌

హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసులో కీలక నిందితుడు లక్ష్మీపతిని నార్కోటిక్‌ వింగ్‌ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఏపీలో అదుపులోకి తీసుకున్నారు. నల్లకుంటలో బీటెక్‌ విద్యార్థి మృతి కేసులో కీలక సూత్రధారిగా లక్ష్మీపతి ఉన్నాడు. హైదరాబాద్‌లో పలువురికి హాష్ ఆయిల్ సప్లై చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఏడేళ్లుగా గంజాయికి బానిసైన లక్ష్మీపతి.. స్టూడెంట్‌గా ఉన్నప్పుటి నుంచి గంజాయి, డ్రగ్స్ అమ్మేవాడని.. ఏజెన్సీ నుంచి హాష్‌ ఆయిల్ తీసుకొవచ్చి ఇక్కడ విక్రయించే వారని పోలీసులు చెబుతున్నారు. లీటర్ హాష్‌ ఆయిల్ ను లక్ష రూపాయలకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో లీటర్‌ రూ.8 లక్షలకు అమ్మేవాడని విచారణలో తేలింది. ప్రేమ్‌కుమార్‌ అనే వ్యక్తితో కలిసి లక్ష్మీపతి డ్రగ్స్‌ అమ్మకాలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి విద్యార్థులకు సరఫరా చేసేవాడని సమాచారం.

ఇవి కూడా చదవండి..

వీడియో: పేలిన బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్

25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ ఇన్స్పెక్టర్