
- ప్రజాప్రతినిధుల అరెస్ట్‌లో పోలీసుల వినూత్న పద్ధతి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయడంలో పోలీసులు వినూత్న పద్ధతి అవలంబిస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీలో, అసెంబ్లీ చుట్టుపక్కల నిరసన తెలిపే ఎమ్మెల్యేలను వాళ్ల పార్టీ ఆఫీసులకు తరలిస్తున్నారు. శుక్రవారం కూడా ఇదే పద్ధతి అనుసరించారు. గన్‌పార్క్ వద్ద నిరసన తెలిపిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకొని తెలంగాణ భవన్‌కు తరలించారు.
అసెంబ్లీ సమావేశాల సమయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష మ్మెల్యేలను అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేడియానికి లేదంటే నాంపల్లి, గాంధీ నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించేవారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత వరకు స్టేషన్‌లోనే ఉంచేవారు.