క్రిమినల్స్ తప్పించుకోలేరు.. పాతనేరస్తుల హిస్టరీతో డిజిటల్ రికార్డ్స్‌‌

క్రిమినల్స్ తప్పించుకోలేరు.. పాతనేరస్తుల హిస్టరీతో డిజిటల్ రికార్డ్స్‌‌
  •   టీఎస్‌‌ కాప్‌‌ యాప్‌‌లో ఓల్డ్‌‌ అఫెండర్స్ చిట్టా
  •      ఆధార్‌‌‌‌ నంబర్‌‌‌‌, ఫింగర్ ప్రింట్స్‌‌తో ట్రేసింగ్
  •     ఏఐ టెక్నాలజీతో పాత నేరస్తుల
  •     కొత్త డేటా బేస్  సిద్ధం చేసిన రాష్ట్ర పోలీస్ శాఖ 

హైదరాబాద్, వెలుగు : పాత నేరస్తులు, ప్రాపర్టీ అఫెండర్స్‌‌ను ట్రేస్‌‌ చేసేందుకు రాష్ట్ర పోలీసుశాఖ హై టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్‌‌(ఏఐ), ఆధునిక డేటాబేస్‌‌ను రెడీ చేసింది. ఏదైనా నేరం జరిగిన వెంటనే అనుమానితులను, నిందితులను గుర్తించేలా డిజిటల్ రికార్డ్స్‌‌ను రూపొందించింది.  గ్రేటర్ హైదరాబాద్‌‌లోని 3 కమిషనరేట్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్‌‌స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను టీఎస్‌‌ కాప్ యాప్‌‌లో ఇప్పటికే అప్‌‌లోడ్ చేశారు. రాష్ట్ర ఫింగర్ ప్రింట్స్‌‌ బ్యూరో కూడా గతేడాది వరకు 9,92,156 మంది అఫెండర్స్‌‌తో కూడిన డేటాను రూపొందించింది. 

దేశవ్యాప్తంగా నమోదైన కేసులతో..

దేశవ్యాప్తంగా నమోదైన కేసుల డేటాబేస్‌‌ను క్రైమ్ అండ్‌‌ క్రిమినల్‌‌ ట్రాకింగ్‌‌ నెట్‌‌వర్క్‌‌ అండ్‌‌ సిస్టమ్‌‌( సీసీటీఎన్‌‌ఎస్‌‌) సేకరిస్తుంది.  ఇందుకనుగుణంగా రాష్ట్ర పోలీసులు ఇప్పటికే అఫెండర్స్ డేటా బేస్‌‌ను రెడీ చేశారు. ఏదైనా క్రైమ్​జరిగినప్పుడు నిందితుల ఫొటోలు, ఆధార్‌‌ ‌‌నంబర్‌‌‌‌, ఫింగర్‌‌ ‌‌ప్రింట్స్‌‌, బ్లడ్ శాంపిల్స్ సేకరించి ఎప్పటికప్పుడు టీఎస్‌‌ కాప్‌‌ యాప్‌‌లో అప్‌‌లోడ్ చేస్తారు. వివిధ కేసుల్లో అరెస్టయిన పాత నేరస్తులు, ప్రాపర్టీ అఫెండర్స్‌‌ పూర్తి వివరాలతో డేటా బేస్‌‌ ఏర్పాటు చేశారు.  పాత నేరస్తులు ఎక్కడ ఏ నేరం చేసినా పోలీస్‌‌ రాడర్‌‌‌‌లోకి వచ్చే విధంగా టీఎస్‌‌ కాప్‌‌ యాప్‌‌లో  పొందుపరిచారు. 

పాపిలాన్‌‌ యాప్‌‌తో పట్టేస్తూ.. 

‘పాపిలాన్ హై ఫ్రీక్వెన్సీ’ యాప్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తిస్తారు. సీన్ ఆఫ్‌‌ అఫెన్స్‌‌లో  ఫింగర్‌‌ ‌‌ప్రింట్స్‌‌ తీసుకుని నిందితులను ట్రేస్ చేస్తారు. ఆ డేటాతో  దేశవ్యాప్తంగా రిజిస్టరైన నిందితుల డేటాతో సరిపోలుస్తారు. అనుమానితుల ఆధార్‌‌‌‌,  ఫింగర్‌‌ ‌‌ప్రింట్‌‌ స్కానింగ్‌‌తో నిందితుల క్రిమినల్‌‌ రికార్డ్స్‌‌ కలెక్ట్‌‌ చేస్తారు.  సీన్‌‌ ఆఫ్‌‌ అఫెన్స్‌‌లో నిందితుల ఫింగర్ ప్రింట్ స్లిప్స్,  ఫొటోలను లైవ్ డిజిటల్ స్కానర్లతో రికార్డ్‌‌ చేస్తారు. క్రిమినల్‌‌ వాంటెండ్‌‌ రికార్డ్స్‌‌లోని వారిపైనా నిఘా పెడతారు.  ఇందుకు సంబంధిత స్పెషల్‌‌ బ్రాంచ్‌‌తో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుంటారు. ఇలా గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 420 కేసులను ఛేదించారు. మరో 4,684 మంది అనుమానితులను ట్రేస్ చేసినట్లు పోలీస్ శాఖ పేర్కొంది.

ఫొటోలతో పాటు అన్ని వివరాలు..

ఏదైనా నేరం జరిగినప్పుడు సీన్‌‌ ఆఫ్‌‌ అఫెన్స్‌‌లో సేకరించిన క్లూస్‌‌తో అనుమానితులను, నిందితులను పోలీసులు విచారిస్తుంటారు. వారి ఆధార్‌‌‌‌, ఫోన్‌‌ నంబర్, ఫింగర్ ప్రింట్స్‌‌ సేకరిస్తుంటారు. ఫొటోతో సహా అన్ని వివరాలను డిజిటల్ రికార్డులతో సరిపోలుస్తారు. అంతేకాకుండా వీటిని సీసీటీఎన్‌‌ఎస్‌‌,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్‌‌లోనూ పరిశీలిస్తుంటారు. పాపిలాన్‌‌ యాప్‌‌ ద్వారా ఫింగర్ ప్రింట్స్‌‌ చెక్ చేస్తారు. అన్ని మ్యాచ్ అయిన వారిపై దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు ఉన్నాయో గుర్తిస్తారు. క్రైమ్‌‌ సీన్‌‌లో సేకరించిన ఫింగర్ ప్రింట్స్‌‌ ఆధారంగా దేశంలోని ఓల్డ్‌‌ అఫెండర్స్‌‌ డేటాను పరిశీలిస్తారు. ఇందులో అంతర్రాష్ట్ర ముఠాలు చేసే ప్రాపర్టీ అఫెన్స్‌‌ల్లో ఎక్కువ శాతం నిందితులను ట్రేస్ చేస్తారు. ఇలా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 3,563 మంది అఫెండర్స్‌‌,1,638 మంది రౌడీ షీటర్స్‌‌ వివరాలు సేకరించారు.