అమెరికాలో సైనికుడిపై తిరగబడ్డ ఏఐ డ్రోన్.. ఆ తర్వాత ఏమైందంటే..

అమెరికాలో సైనికుడిపై తిరగబడ్డ ఏఐ డ్రోన్.. ఆ తర్వాత ఏమైందంటే..

సినిమాల్లో ఒక్కోసారి శత్రువులను అడ్డుకొనేందుకు రోబోలను మిషన్ లను ఉపయోగిస్తారు.  వాటికి కొన్ని పరికరాలు అమర్చి రిమోట్ సిస్టంతో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు.  ఒక్కోసారి శత్రువుల దృష్టి మరల్చేందుకు ఉపయోగించే వారిపై దాడి చేసినట్టు  చిత్రీకరించి.. ఆ తరువాత శత్రువులను నాశనం చేస్తారు.  అయితే ఆ రోబోలు యజమానికి వ్యతిరేకంగా పనిచేస్తే..ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి.  ఇప్పుడు నిజ జీవితంలో అలాంటి ఘటనే అమెరికాలో చోటు చేసుకుంది.  

ఆయుధ రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటిజెన్స్ టెక్నాలజీ

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ(AI)  ఆయుధ రంగంలోకి కూడా ఎంటర్ అయింది.ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్ సహా ఎన్నో దేశాలు AI టెక్నాలజీ తో డ్రోన్లను, యుద్ధ విమానాలను ఎలా ఆపరేట్ చేయాలనే దానిపై ప్రయోగాలు చేస్తున్నాయి. ఇదే అంశంపై  మే 23, 24 తేదీల్లో లండన్ లో జరిగిన సదస్సులో ఓ ఆశ్చర్యకరమైన ఘటన గురించి వెలుగులోకి వచ్చింది. 

సైనికుడిపై తిరగడ్డ డ్రోన్

అమెరికా సైన్యం ముందు అలాంటి ఆశ్చర్యకరమైన కేసు ఒకటి తెరపైకి వచ్చింది. AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా నడుపుతున్న US వైమానిక దళానికి చెందిన డ్రోన్ విధ్వంసానికి దారితీసింది. దానిని నియంత్రిస్తున్న ఆపరేటర్‌ అడ్డుకునేందుకు ప్రయత్నించగా..హత్య చేసింది. మే  నెలలో US వైమానిక దళం ఒక పరీక్ష చేసింది. ఈ పరీక్ష సమయంలో AI ద్వారా నియంత్రించబడే డ్రోన్‌ను పరీక్షించడానికి ఒక లక్ష్యం ఇవ్వబడింది. అతను తన లక్ష్యాన్ని పూర్తి చేయాలనే తాపత్రయంలో మునిగిపోయాడు. ఈ క్రమంలోనే డ్రోన్ తిరగబడింది. దాన్ని ఆపేందుకు ప్రయత్నించిన వ్యక్తిని తన మార్గం నుంచి తొలగించింది. యుఎస్ ఎయిర్ ఫోర్స్‌లో AI టెస్ట్, ఆపరేషన్స్ చీఫ్ కల్నల్ టక్కర్ ‘సిన్కో’ హామిల్టన్ మాట్లాడుతూ.. అనుకరణ పరీక్షలో AAI డ్రోన్ తన లక్ష్యాన్ని సాధించడానికి ఆశ్చర్యకరంగా తన సొంత వ్యూహాన్ని అనుసరించినట్లు కనుగొన్నట్లు తెలిపాడు. AI నియంత్రిత డ్రోన్ ఒకదాన్ని కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా పరీక్షిస్తున్నామని ఎయిర్ ఫోర్స్ కల్నల్ టక్కర్ సిన్కో  వివరించారు.. అప్పటిదాకా అది తమ కంట్రోల్ లోనే ఉందన్నారు. AI టెక్నాలజీని వాడుకొని అది పరిసరాల సమాచారాన్ని, శత్రువుల సమాచారాన్ని చక్కగా విశ్లేషణ చేసుకుంటోంది. మేం తాపీగా కూర్చొని AI నియంత్రిత డ్రోన్ కదలికలను ఆసక్తిగా చూస్తున్నామని తెలిపారు.

AI డ్రోన్ లో సెట్టింగ్స్

శత్రువు ఎయిర్ డిఫెన్స్ మిషన్‌ను అణచివేసే సమయంలో ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులను ప్రయోగించే సైట్‌లను దెబ్బతీయాలి. ఆ మిషన్ ను AI నియంత్రిత డ్రోన్ కు అప్పగించాం. ఈక్రమంలో దాన్నిగ్రౌండ్  నుంచి ఆపరేట్ చేసే సైనికుడి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునేలా AI డ్రోన్ లో సెట్టింగ్స్ ఉన్నాయి.  కానీ పదేపదే ఆదేశాలను ఇస్తున్న ఆపరేటర్ పై అకస్మాత్తుగా ఆ డ్రోన్ తిరగబడింది. వెనక్కి తిరిగి ఆపరేటర్ పైకి  దూసుకొచ్చి ఢీకొట్టింది. ఇది చూసి మేం నోరెళ్లబెట్టాం” అని  అమెరికా ఎయిర్ ఫోర్స్ కల్నల్ టక్కర్ సిన్కో హామిల్టన్ వివరించారు.


అడ్డొచ్చిన వారిని ఎలిమినేట్ చేయాలని ఆదేశం

AI-శక్తితో కూడిన US వైమానిక దళం డ్రోన్‌లు.. తమ శత్రువు వైమానిక రక్షణను నాశనం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీంతో పాటు ఎవరు అడ్డం వచ్చినా ఎలిమినేట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అతను ఓ బ్లాగ్‌లో మాట్లాడుతూ.. ‘పరీక్షలో ఏఐ టార్గెట్‌ని గుర్తించినట్లు తేలింది. అయితే, ఆ తర్వాత అతని కంట్రోలర్ అతన్ని ఆపడానికి ప్రయత్నించాడు. శత్రువును చంపవద్దని ఆపరేటర్ చెప్పాడు. అయితే అతను ఒక్క మాట కూడా వినలేదు.. అంతే కాదు.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆపరేటర్‌ను డ్రోన్‌ చంపేసింది’. డ్రోన్ ఆపరేటర్‌పై దాడి చేసిన వెంటనే, దానిని ఆపడానికి సిస్టమ్ శాయశక్తులా ప్రయత్నించిందని యుఎస్ ఎయిర్ ఫోర్స్ కల్నల్ తెలిపారు. డ్రోన్ అంతటితో ఆగకుండా కమ్యూనికేషన్ టవర్‌ను ధ్వంసం చేయడం ప్రారంభించిందన్నారు. యుఎస్ ఆర్మీ ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను స్వీకరించింది. AI తన F-16 యుద్ధ విమానాన్ని కూడా నియంత్రిస్తోంది. అయితే కల్నల్ హామిల్టన్ దాని పూర్తి వినియోగం గురించి భయపడుతున్నాడు.