రాముడు ఆదేశించాడు.. నేను అలానే విగ్రహాన్ని చెక్కా: శిల్పి అరుణ్ యోగిరాజ్

రాముడు ఆదేశించాడు.. నేను అలానే విగ్రహాన్ని చెక్కా: శిల్పి అరుణ్ యోగిరాజ్

అయోధ్య రాముడి విగ్రహాన్ని చెక్కిన శిల్పి  అరుణ్ యోగి రాజ్  ఆసక్తికర విషయాలు వెల్లడించారు.  బాల రాముడి విగ్రహం చెక్కిన సమయంలో ఆయన కళ్ళ గురించి  భయం వేసిందని తెలిపారు.  రాముడు ఆదేశించాడు..  నేను చెక్కుకుంటూ పోయానని చెబుతున్నారు. చిన్న పిల్లలు ఎలా ఉంటారు... గమనించి అదే పసితనంలో రాముడు ఎలా ఉండేవాడు...  రాముడు విగ్రహాన్ని ఎలా రూపొందించాలి... కళ్లను ఎలా తీర్చిదిద్దాలి అనే విషయాల గురించి చాలా రోజులు తర్జనబర్జన పడ్డానని తెలిపారు. 

ముఖ్యంగా కళ్లు,  పెదాలను చాలా శ్రద్ధతో చెక్కా నని తెలిపాడు.  అంతా రాముడి దయతోనే విగ్రహాన్ని చెక్కానని అరుణ్ యోగిరాజ్ అన్నారు.  ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు దాదాపు ఏడు నెలలు శ్రమించినట్లు చెప్పాడు. ఈ ఏడు నెలల సమయం తనకి ఒక సవాలుగా మారిందని వివరించాడు.  ఐదేళ్ల రాముడిగా కనిపించడం చాలా కనిపించేలా చెక్కడం ఛాలెంజింగ్ అనిపించిందని చెప్పాడు.

గతంలో చాలా విగ్రహాలను తయారు చేశానని .. కాని ఎప్పుడు అలా అనిపించలేదని అరుణ్ యోగిరాజ్ చెప్పారు.చెక్కుతున్న సమయంలోనే ఒక్కో దశలో ఒక్కో విధంగా కనిపించింది కానీ, ఆభరణాలతో అలంకరించిన తర్వాత మొత్తం రూపు రేఖలు మారిపోయాయని శిల్పి అరుణ్ యోగిరాజ్ తెలిపారు. 

ప్రతిష్టించిన సమయంలో చూస్తే అసలు ఆ విగ్రహాన్ని చెక్కింది, తానేనా అని ఆశ్చర్యపోయానని చెప్పాడు.  ఇదంతా రాముడు దయతోనే జరిగింది..  ఎన్నో విగ్రహాలు చెక్కినప్పటికీ, అయోధ్య రాముడి విగ్రహం చెక్కే అదృష్టం తనకే దక్కడం సంతోషంగా ఉందని చెబుతున్నాడు.   జనవరి 22వ తారీకు ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత తెర తొలగించారు...  అప్పుడే తొలి దర్శనం ఇచ్చాడు. అయోధ్య రాముడు సోషల్ మీడియా అంతటా ఫోటోలే కనిపిస్తున్న వందల ఏళ్ల కల నెరవేరింది అంటూ షేర్ చేస్తున్నారు.

అలంకరణ తర్వాత అంతా ఆ రామయ్య విగ్రహానికి అంత అందం వస్తుందని, ఊహించలేదని అన్నాడు. ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత ఏదో, తెలియని అందం అందులోకి వచ్చి చేరిందని ఆనందం వ్యక్తం చేశాడు. ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత బాల రాముడి విగ్రహం రూపురేఖలు మారిపోయాయి. అసలు తయారు చేసింది నేనేనా అని నాకు అనుమానం వచ్చింది. అలంకరణ తర్వాత రామయ్య స్వరూపమే మారిపోయింది.