న్యూఢిల్లీ: అరవింద్ ఫ్యాషన్స్ లిమిటెడ్, ఫ్లిప్‌కార్ట్ గ్రూపునకు చెందిన అరవింద్ యూత్ బ్రాండ్స్‌లో 31.25 శాతం వాటాను కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం రూ.135 కోట్లు వెచ్చిస్తోంది. ఫ్లయింగ్ మెషీన్ బ్రాండ్ కింద ఈ సంస్థ దుస్తులు, యాక్సెసరీలను అమ్ముతోంది.
2025 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ టర్నోవర్ రూ.432.16 కోట్లుగా ఉంది. డీల్ పూర్తయిన తర్వాత అరవింద్ యూత్ బ్రాండ్స్ పూర్తిగా అరవింద్ ఫ్యాషన్స్ అనుబంధ సంస్థగా మారుతుంది. వినియోగదారులు ఫ్లయింగ్ మెషీన్ ఉత్పత్తులను ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర డిజిటల్ ప్లాట్ ఫామ్‌లపై కూడా కొనుగోలు చేయవచ్చు.
