సైంధవ్​తో రీఎంట్రీ

సైంధవ్​తో రీఎంట్రీ

డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపును అందుకున్నాడు కోలీవుడ్ హీరో ఆర్య(Arya). 2010లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘వరుడు’ చిత్రంతో టాలీవుడ్‌‌‌‌‌ ఎంట్రీ ఇచ్చిన ఆర్య, ఆ తర్వాత అనుష్కకు జంటగా ‘సైజ్‌‌ జీరో’లో నటించాడు. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో కనిపించబోతున్నాడు.

వెంకటేష్(Venkatesh) హీరోగా రూపొందుతున్న  సైంధవ్‌( Saindhav) చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను(Sailesh Kolanu) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఏడు పాత్రలను పరిచయం చేశారు. బుధవారం ఎనిమిదో పాత్రగా మానస్‌‌ అనే క్యారెక్టర్‌‌‌‌లో ఆర్యను రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

ఇందులో ఫార్మల్ కాస్ట్యూమ్స్‌‌లో స్టైలిష్‌‌గా కనిపిస్తున్న ఆర్య.. చేతిలో మెషిన్ గన్‌‌తో ఫెరోషియస్‌‌గా ఉన్నాడు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా, సారా, జయప్రకాష్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 22న ఐదు భాషల్లో  సినిమా రిలీజ్ కానుంది.