బషీర్‌బాగ్, వెలుగు: ప్రభుత్వ సహకారంతో యువతకు పారిశ్రామిక శిక్షణతో పాటు ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం, ఆర్థిక సహాయాలు అందించనున్నట్లు అఖిలభారత ఆర్యవైశ్య పారిశ్రామికవేత్తల ఫోరం నిర్వాహకులు తెలిపారు. ఫోరం రజతోత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 1న నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ప్రధాన్ కన్వెన్షన్‌లో ఇండస్ట్రియల్ సమిట్ ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఫోరం అధ్యక్షుడు రాంబాబు పబ్బిశెట్టి వెల్లడించారు.
గురువారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో సమిట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఏపీ మంత్రి టి.జి. భరత్‌తో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరవుతారని తెలిపారు. యువతలో పారిశ్రామిక రంగంలో ఆసక్తి పెంచేందుకు 50 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
