
హైదరాబాద్‌సిటీ, వెలుగు: మంత్రి వివేక్ వెంకటస్వామికి ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత వెంటనే క్షమాపణలు చెప్పాలని తెలంగాణ ఆర్యమహాసభ నేతలు డిమాండ్‌చేశారు. మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, ట్రెజరర్మల్లికార్జున్, ఆర్గనైజింగ్‌సెక్రటరీ గణేశ్‌గుప్తా, సెక్రటరీ ముక్తా శ్రీనివాస్ గురువారం ఖైరతాబాద్చింతల్ బస్తీలోని మహాసభ ఆఫీసులో మాట్లాడారు.
కాల్వ సుజాత కాంగ్రెస్‌లో కొనసాగుతూ ఆ పార్టీలోనే ఉన్న మంత్రి వివేక్‌వెంకటస్వామిని దూషించడం సరికాదన్నారు. ఆర్య వైశ్యులు మంత్రి దగ్గరికి సొంత ప్రయోజనాల కోసం వెళ్లలేదని, ఆర్య వైశ్య సంస్థ కోసం వెళ్లి కలిశామన్నారు. సుజాత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు విషయాన్ని తీసుకెళ్తామన్నారు.