లండన్: ఊహించినట్లుగానే ఇంగ్లండ్ వైట్‌బాల్ టీమ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించాడు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపాడు. 35 ఏళ్ల మోర్గాన్.. మొదట ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్‌కప్ వరకు కొనసాగాలని అనుకున్నా జట్టుకు భారంగా మారడం కంటే తప్పుకోవడమే మేలని భావించాడు. 1986లో ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో పుట్టిన 35 ఏళ్ల మోర్గాన్2006లో ఐర్లాండ్ తరఫునే వన్డేల్లో డెబ్యూ చేశాడు. 16 ఏళ్ల కెరీర్‌లో ఏడేళ్లకు పైగా వన్డే, టీ20 టీమ్‌కు కెప్టెన్‌గా పని చేశాడు. అతని హయాంలోనే ఇంగ్లండ్ 2010లో టీ20 వరల్డ్‌కప్, 2019 వన్డే వరల్డ్‌కప్ గెలిచి చరిత్ర సృష్టించింది.
