యుద్ధం వదిలి ట్రంప్ పారిపోవటంతో ఊపిరి పీల్చుకున్న ప్రపంచ మార్కెట్లు..!

యుద్ధం వదిలి ట్రంప్ పారిపోవటంతో ఊపిరి పీల్చుకున్న ప్రపంచ మార్కెట్లు..!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో యుద్ధం కొనసాగించాల్సి వస్తోంది. ఇజ్రాయెల్ చెప్పిందని వార్ స్టార్ట్ చేసిన ట్రంప్ ఇప్పుడు ఎగ్జిట్ ప్లాన్ లేక అలా అని ఓడిపోయానని ఒప్పుకోలేక అటు అమెరికా సైనిక అధికారులు ఇటు ఇజ్రాయెల్ మధ్య సతమతం అవుతున్నారు. ఇరాన్ తలవంచేదే లేదని తేల్చి చెప్పేయటంతో సైలెంట్ గా యుద్ధం నుంచి పారిపోవాలని ట్రంప్ ఇప్పుడు చూస్తున్నారు. అందుకే యుద్ధానికి బ్రేక్ కావాలి, నెల రోజులు కాల్పుల విరమణ అంటూ ప్రతిపాదనలు పంపిస్తున్నారు.

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం నుంచి ఎలాగైనా తప్పుకోవాలని చేస్తున్న ప్రయత్నాలతో గ్లోబల్ మార్కెట్లు కోలుకుంటున్నాయని సోషల్ మీడియాలో చాలా మంది మార్కెట్ల పెరుగుదలకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తున్నారు. ట్రంప్ యుద్ధం వదిలి పారిపోవటానికి తట్టాబుట్టా సర్థేసుకోవటంతో ఇన్వెస్టర్లలో ధైర్యం, విశ్వాసం పెరుగుతున్నాయి. అయినా యుద్ధం వల్ల అయిన ఖర్చు ట్రంప్ గల్ఫ్ దేశాల నుంచి వసూలు చేసేందుకు సిద్ధం కావటంతో అటు అమెరికాకు కూడా పెద్దగా వచ్చిన నష్టం ఏం లేదంటున్నారు ఆర్థిక నిపుణులు. 

Also Read : 45 రోజులకు అవసరమైన క్రూడ్ రిజర్వ్స్ రిలీజ్

మెుత్తానికి ట్రంప్ నిర్ణయం కారణంగా భారత స్టాక్ మార్కెట్లు రెండు రోజుల నుంచి నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. నేడు మార్కెట్ల క్లోజింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 395 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచీ 1102 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1244 పాయింట్ల లాభంతో పవర్ ఫుల్ బుల్ ర్యాలీని కనబరిచాయి. మెుత్తానికి ట్రంప్ నెల రోజుల సీజ్ ఫైర్, యుద్ధం నిలిపివేసేందుకు చేస్తున్న ప్రయత్నాలతో ఇరాన్ విషయంలో ఉద్రిక్తతలు చివరి దశకు చేరుకున్నాయని భారత ఇన్వెస్టర్లతో పాటు గ్లోబల్ ఇన్వెస్టర్లు బలంగా నమ్ముతున్నారు.