
ఇండియా సిరియా అవుతుందని శ్రీశ్రీ రవిశంకర్ గతంలో అన్నాడన్న అసద్
హైదరాబాద్ : అయోధ్యలో మందిర్ – మసీద్ వివాదం పరిష్కారం కోసం ముగ్గురు సభ్యుల మీడియేషన్ ప్యానెల్ కూర్పుపై అభ్యంతరం చెప్పారు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ ను కాకుండా ఓ న్యూట్రల్ పర్సన్ ను కమిటీ లో చేర్చి ఉంటే మరింత బాగుండేదని ఆయన అన్నారు. అయోధ్యపై చేస్తున్న వాదన విషయంలో ముస్లింలు వెనక్కి తగ్గకపోతే.. ఇండియా మరో సిరియాలా మారుతుందని గతంలో శ్రీశ్రీ రవిశంకర్ ఓ వివాదాస్పద వ్యాఖ్య చేశారని చెప్పారు అసదుద్దీన్.