
తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సినీ ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే పోలింగ్ సిబ్బంది పసి పాపలతో విధులకు హాజరయ్యారు.
జనగామ జిల్లా కేంద్రంలోని ఏబీవీ హై స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఆశ వర్కర్ పసిపాపతో విధులకు హాజరైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమెను చూసైనా ప్రతి ఒక్కరూ బాద్యతగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు పలువురు నెటిజన్లు.
రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల 809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపింది ఈసీ. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నడుస్తుందని తెలిపింది.