ఆశ వర్కర్లకు ఆర్నెల్లుగా జీతాల్లేవ్​

ఆశ వర్కర్లకు ఆర్నెల్లుగా జీతాల్లేవ్​

గ్రామీణ ప్రజానీకానికి నిత్యం అందుబాటులో ఉంటున్న ఆశ వర్కర్లకు  ప్రభుత్వం ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదు.  క్షేత్రస్థాయిలో రోజు పది గంటలకు పైగా పనిచేస్తున్న ఆశ వర్కర్లకు గతంలో రూ.1,500ల గౌరవ వేతనం ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 106 రోజుల పాటు చేసిన  సమ్మె ఫలితంగా వేతనాన్ని రూ.7,500లకు పెంచారు. అయితే గత ఆరు నెలల నుంచి వేతనాలు పెండింగ్​లో ఉండడంతో ఆశ వర్కర్లు ఆర్ధికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  వికారాబాద్​   జిల్లాలో ప్రతి వెయ్యి మందికి ఇద్దరు చొప్పున ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు. జిల్లా జనాభా 9.2లక్షల మంది ఉండగా ప్రభుత్వ నిష్పత్తి ప్రకారం 940 మంది ఆశ వర్కర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం జిల్లాలో 740  పోస్టులు మాత్రమే మంజూరు కావడంతో ఆమేరకు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ఏఎన్​ఎంల ఆధ్వర్యంలో గ్రామాల్లో ఆరోగ్య పరీక్షలు, గర్బిణులను గుర్తించి వారికి పౌష్టికాహారం సూచనలు, సలహాలు ఇస్తుంటారు.