ఆశా వర్కర్లు ధైర్యంగా పని చేయండి

ఆశా వర్కర్లు ధైర్యంగా పని చేయండి

కరోనా వైరస్ నివారణలో హెల్త్, పోలీస్ డిపార్ట్ మెంట్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని , ధైర్యంగా పనిచేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆశా వర్కర్లకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ని కంటైన్మెంట్ కస్ల్టర్లు గా గుర్తించిన అహ్మదిపుర కాలనీ, మాలపల్లిలో ఆయన పర్య టించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వేను పరిశీలించారు. ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా అని ఆశావర్కర్లను అడిగారు. సాఫీగా కొనసాగుతుందని, ప్రజలు సహకరిస్తున్నారని వారు కలెక్టర్ కు వివరించారు. సిబ్బందికి అవసరమైన రక్షణ చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకుందని, సమస్యలు ఉంటే ఆఫీసర్ల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ వారికి సూచించారు. ఆ ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా కెమికల్స్ స్ప్రే చేస్తున్న విధానాన్ని మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ వో శ్రీనివాస్, డీఈఈ రషీద్ పాల్గొన్నారు.

హాలో.. నేను మీ కలెక్టర్ను మాట్లాడుతున్నా..

‘హాల్.. నేను మీ జిల్లా కలెక్టర్ ను మాట్లాడుతున్నా..’ అంటూ కొను గోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడకుండా ధాన్యం తెచ్చే విధానాన్ని వివరిస్తూ బుధవారం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి రైతులకు వాయిస్ మెసేజ్  పంపారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ ను మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉందని, దీనికి అందరూ సహకరించాలని కోరారు. లాక్ డౌన్ ఉన్నందన కొనుగోలు కేంద్రాలలో గోనె సంచులు, హమాలీ కొరత లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని, దానిని రైతులు గమనించాలన్నారు. ఆఫీసర్లు కేటాయించిన తేదీ రోజే రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకురావాలని సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతీ రైతు సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. ఈ మెసేజ్ చైన్ సిస్టంలో రైతులందరికీ చేరేలా షేర్ చేయాలని ఆయన కోరారు.