కోల్‌బెల్ట్/నిజామాబాద్/కొత్తపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట శివారులోని గాంధారిఖిల్లా మైసమ్మ ఆషాడ బోనాల జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. భక్తులు మైసమ్మ తల్లికి బోనాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. క్యాతనపల్లి మున్సిపల్‌చైర్‌పర్సన్ సంధ్యరాణి -రాజా రమేశ్దంపతులు, ప్రజాప్రతినిధులు, నాయక్ పోడ్ గిరిజన సంఘం లీడర్లు ప్రత్యేక పూజలు చేశారు. మందమర్రిలోని యాపల్ ప్రాంతంలోని పోచమ్మ తల్లి ఆలయంలో ఆషాడ బోనాల వేడుకలు నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, -జడ్పీ మాజీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి దంపతుల, మున్సిపల్కమిషనర్రాజలింగు, లీడర్లు పూజలు చేశారు. నిజామాబాద్‌లోని పాత కలెక్టరేట్ వద్ద తెలంగాణ గెజిటెడ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. క్యాక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, టీజీవో అధ్యక్షుడు అలుక కిషన్, ఉద్యోగులు పాల్గొన్నారు.
