పనిమనిషిపై ఆరు నెలలుగా అత్యాచారం..

పనిమనిషిపై ఆరు నెలలుగా అత్యాచారం..

పనిమనిషి పై ఆరు నెలలు అత్యాచారం చేశాడు ఒకతను. హైదరాబాద్ లోని బాలానగర్ పోలీస్టేషన్ పరిధిలోని రాజుకాలనీలో ఈ ధారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అర్షద్ ఖాన్ అనే యువకుని ఇంట్లో ఓ అమ్మాయి పని చేయడానికి కుదిరింది. అయితే ఆ అమ్మాయిపై కన్నేసిన అర్షద్ పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. అతని మాటలను నమ్మిన ఆ అమ్మాయి అర్షద్ కు లొంగిపోయింది. దీంతో ఆరు నెలలుగా అత్యాచారం చేశాడు. కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోమని నిలదీయగా అర్షద్ ముఖం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ అమ్మాయి.. తన తల్లిదండ్రుల సహాయంతో బాలానగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లేంట్ చేసింది. నింధితుడు అర్షద్ ఖాను ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు పంపారు.