
ఎస్ఎస్ దుష్యంత్, ఆశికా రంగనాథ్ లీడ్ రోల్స్‌లో సింపుల్ సుని తెరకెక్కిస్తున్న చిత్రం ‘గత వైభవ’. దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. నవంబర్ 14న సినిమా విడుదల కానుంది. బుధవారం వర్ణమాల అనే పాటను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హీరోయిన్ ఆశికా రంగనాథ్ మాట్లాడుతూ ‘ఇప్పటికే రెండు తెలుగు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నేను ఇప్పుడు ‘గత వైభవ’ అనే కన్నడ చిత్రంతో వస్తున్నా. ఇది చాలా డిఫరెంట్ సినిమా. నాలుగు వైవిద్యమైన కథలు ఇందులో ఉన్నాయి. నేను ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా ఇది’ అని చెప్పింది.
‘హిస్టరీ, మైథాలజీ, సనాతన ధర్మ లాంటి అంశాలను కలగలిపి, చక్కని స్క్రిప్ట్‌తో ఈ చిత్రం తీశారని దుష్యంత్ తెలిపాడు. ఇదొక ఫాంటసీ మైథలాజికల్ సినిమా అని దర్శకుడు సుని తెలియజేశాడు. నిర్మాత దీపక్, సంగీత దర్శకుడు శాండీ, సింగర్ అనురాగ్ కులకర్ణి, డీవోపీ విలియం పాల్గొన్నారు.