దిల్రాజు ఫ్యామిలీ హీరో కోసం..అదిరిపోయే టెక్నికల్ టీమ్

దిల్రాజు ఫ్యామిలీ హీరో కోసం..అదిరిపోయే టెక్నికల్ టీమ్

దిల్రాజు ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో ఆశిష్(Ashish). రౌడీ బాయ్స్ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చిన ఈ యువ హీరో..మరో మూవీతో రానున్నారు.ప్రసెంట్ సెల్ఫిష్ మూవీలో నటిస్తున్న రౌడీ హీరో నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.  లేటెస్ట్ గా ఆశిష్ 3(Ashish3) అనే వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ మూవీ పూజా కార్యక్రమం ఇవాళ(ఆగస్టు 21న) సినీ ప్రముఖుల మధ్య జరిగింది. 

ఈ మూవీని డెబ్యూ డైరెక్టర్ అరుణ్ భీమవరపు లవ్,కామెడీ,హార్రర్ జోనర్ లో డైరెక్ట్ చేస్తున్నారు.ఈ మూవీ కోసం ఆస్కార్ అవార్డు మ్యూజిక్ డైరెక్టర్  MM కీరవాణి అద్భుత స్వరాలూ అందిస్తున్నట్లు సమాచారం. సినిమాటోగ్రాఫర్గా నేషనల్ ఫిలిం అవార్డు విన్నర్  పిసి శ్రీరామ్‌, ఆర్ట్ డిపార్ట్ మెంట్ ఇన్ చార్జిగా అవినాష్ కొల్లా ఈ మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. 

ఆశిష్ 3 మూవీని బలగం లాంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాని ప్రొడ్యూస్ చేసిన హర్షిత్‌ రెడ్డి, హన్షితారెడ్డి దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దిల్ రాజ్ తమ్ముడు శిరీష్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆశిష్ 3 మూవీ పూజా ఈవెంట్కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ప్రొడ్యూసర్ చినబాబు, నాగవంశీ ఈవెంట్ లో పాల్గోన్నారు. 

హీరో ఆశిష్ కోసం నేషనల్ అవార్డ్ విన్నర్స్ ను రంగంలోకి దింపడం వెనుక..దిల్రాజు మాస్టర్ ప్లాన్ కనిపిస్తోంది. ఈ సారి ఎలాగైనా ఆశిష్ ను స్టార్ హీరోగా చేయడానికి చేస్తున్న గట్టి ప్రయత్నాలు మరి ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ఆశిష్ సెల్ఫిష్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ మూవీని సుకుమార్ శిష్యుడు విశాల్ కాశీ అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కిస్తున్నారు. కాగా సెల్ఫిష్ మూవీని సుకుమార్ రైటింగ్స్, దిల్ రాజు శ్రీ వెంటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.