
ఆశిష్,వైష్ణవి చైతన్య జంటగా అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘లవ్ మీ’. ‘ఇఫ్ యు డేర్’ అనేది ట్యాగ్‌లైన్. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా వచ్చిన టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్‌తో పాటు సినిమాపై ఆసక్తిని పెంచింది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. లవ్ మీ మే 25, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతుందని పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే, ఏప్రిల్ 25న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా లవ్ మీ రిలీజ్ పోస్ట్ఫోన్ అవ్వడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.
ALSO READ | Aparna Das Marriage: గుడిలో పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్..వరుడు కూడా ఫేమస్ హీరోనే
ఇదొక హారర్ థ్రిల్లర్. ఓ కుర్రాడు దెయ్యాన్ని ప్రేమిస్తే ఎలా ఉంటుంది, ఏమవుతుంది లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
? #GhostLove alert ?
— Sri Venkateswara Creations (@SVC_official) April 24, 2024
Get ready to experience love of a new kind at the cinemas ??#LoveMe - '?? ??? ????' GRAND RELEASE WORLDWIDE ON MAY 25th, 2024@AshishVoffl @iamvaishnavi04 @mmkeeravaani @pcsreeram #ArunBhimavarapu @boselyricist @artkolla @HR_3555… pic.twitter.com/pSsBVa4gVP
ఆశిష్ రెడ్డి ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) సోదరుడు శిరీష్ (Shirish) కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ మొదటి సినిమాతోనే మంచి మార్కులు తెచుకున్నాడు. సినిమా మాత్రం ఆశించినంత సక్సెస్ కాలేకపోయింది. ఆ తరువాత వెంటనే సెల్ఫీష్ అనే సినిమాను మొదలుపెట్టాడు. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ సినిమా గత రెండు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. మరి ఇపుడు త్వరలో రిలీజ్ కానున్న లవ్ మీ తో ఎలాంటి హిట్ అందుకోనున్నాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.