
ఆపరేషన్ సింధూర్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన అశోకా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫొసర్ అలీ ఖాన్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ సవాల్ చేస్తూ అలీఖాన్ మహమూదాబాద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలీఖాన్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ కు అర్జెంట్ లిజనింగ్ పిటిషన్ సమర్పించారు. మంగళవారం లేదా బుధవారం ఈ కేసులు విచారించనున్నట్లు సీజేఐ తెలిపారు.
ALSO READ | ఆపరేషన్ సిందూర్‌పై వ్యాఖ్యలు.. అశోక వర్సిటీ ప్రొఫెసర్ అరెస్టు
ఆపరేషన్ సిందూర్ కు వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో పోస్ట్లు పెట్టిన అలీఖాన్ ను హర్యానా పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అలీఖాన్ ను రెండు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. హర్యానా రాష్ట్ర మహిళా కమీషన్ కూడా ఆ ప్రొఫెసర్‌కు నోటీసులు ఇచ్చింది. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థంచేసుకున్నారని అలీఖాన్ తెలిపారు.